గోరంత చురక నెయిల్ ఆర్ట్ డిజైన్

0
1942

ఇది “పేపర్ బర్నట్” నెయిల్ ఆర్ట్, వెరైటీ ప్రియులను ఆకట్టుకొనే నఖా నగిషి ఇది. ఇదివరకు మీరు చూసిన ఆర్ట్ కన్నా ఈ ఆర్ట్ భిన్నంగా వుంటుంది.

న్యూస్పేపర్ కాలిన ఆనవాళ్ళు గొల్లపై వేసుకోవడం నేర్చుకుందాం, దీని కోసం న్యూస్ పేపర్ ముక్కలు, ఆల్కహాల్ (స్పిరిట్ లాంటింది ఏదైనా సరిపోతుంది), వైట్, బ్లాకు, ట్రాన్స్పరెంట్, మరియు బ్రౌన్ కలర్ నెయిల్ పోలిష్ ను సిద్దం చేసుకోవాలి.

ఈ డిజైన్ అప్లై చేసుకోవడానికి కింది విధంగా స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

  • ముందుగా గొల్లన్ని శుభ్రం చేసుకొని అందంగా కత్తిరించికోవాలి . తర్వాత వాటన్నింటి పై వైట్ కలర్ నైల్ పోలిష్ ను పూర్తిగా అప్లై చేసుకోవాలి .

  • ఇప్పుడు న్యూస్ పేపర్ ముక్కలను ఆల్కాహాల్ లో వేయాలి, ఒక నిమిషం తరువాత దాన్ని బయటికి తీయాలి.

  • ఆ న్యూస్ పేపర్ ముక్కలను ఇప్పుడు గోరు పై పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి.

  • అ పేపర్ పై అక్షరాలు మీ గోరుపై అతుక్కుంటాయి. ఇప్పుడు ఆ గోరుకు ట్రాన్స్పరెంట్ నెయిల్ పోలిష్ వేయాలి

  • ఇప్పుడు బ్లాకు పోలిష్ తో ఆ గోరు పై బోర్డర్ లో పొడవాటి గీత మధ్యలో ఓ సర్కిల్ గీయాలి.

  • ఆ బ్లాకు కలర్ ను ఇప్పుడు కాస్త వెడల్పు గా చేసుకోవాలి.

  • సర్కిల్ ను మొత్తం నల్లగా చేసి చివర వున్నా రంగు ను కాస్త వెడల్పు చెయ్యాలి.

  • ఇప్పుడు బ్రౌన్ కలర్ పోలిష్ తో నల్ల రుంగు చుట్టూ బార్డర్ లు గీసుకోవాలి  .

  • చివరగా ఆ నల్లటి సర్కిల్ లో రంధ్రం పెట్టాలి(చిరిగినా పేపర్లా)అలాగే ఫోటో లో కనిపించినట్లు ఒక్కో గోరు పై ఒక్కో డిజైన్ ను వేసుకోవాలి .

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here