పూల్ త్రు బ్రైడ్ హెయిర్ స్టైల్ డిజైన్

దీన్ని పూల్ త్రు బ్రైడ్ హెయిర్ స్టైల్ అని అంటారు. ఇది చూడటానికి భలే అందంగా వుంటుంది,ఆకర్షనియంగా కనిపిస్తుంది జుట్టు కాస్త పొడవుగా వొత్తుగా వున్నవారికైతే ఈ పూల్ త్రు బ్రైడ్ మరి అందంగా వుంటుంది .

చిన్నపిల్లలనుంచి పెద్దవారివరకు ఈ హెయిర్ స్టైల్ ఎవరికైనా భలేగా వుంటుంది. ఘాగ్ర సరీస్ అనే కాకుండా స్కాట్స్, ఘవన్ల మీద కూడా బాగా సూట్ అవుతుంది. దీన్ని ఒక్కసారి వేసుకుంటే మల్లి మల్లి ఈ స్టైల్ ను వేసుకోవడానికి మక్కువ చూపక మానరు.

  • ముందుగా జుత్తునంత చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.ఆపైన ముందు భాగంలోని జుట్టును కొద్దిగా తీసుకొని బ్యాండ్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు పోనీని పైకి లాగి ఏదైనా ప్లక్కేర్ లాంటిది పెట్టుకోవాలి.తరువాత దానికింద ఇరువైపులనుంచి సన్నని పాయను తీసుకొని బ్యాండ్ పెట్టుకోవాలి.

  • ప్లక్కర్ తొలిగించి ఆ పోనీ లోని జుట్టును రెండు భాగాలుగా విడదీసుకోవాలి.జుట్టును హెయిర్ స్ప్రే చేసుకుంటూ ఎప్పడికప్పుడు దువ్వుకోవాలి.

  • తరువాత ఫోటోలో కనిపిస్తున్న విధంగా పై పోనిలోని రెండు భాగాలను కింది పొనికి ఇరువైపులా వేసి ఆపోనిని పైకి లాగి ప్ల్కెర్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు పైచెప్పిన పోనీ రెండు భాగాలకు ఇరువైపులనుంచి సన్నని పాయలను తీసుకొని వాటన్నింటిని కలిపి బ్యాండ్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు ముందు పోనీ ని రెండు భాగాలుగా చేసి అరువత పోని ని పైకి లాగి ప్లక్కర్ పెట్టుకోవాలి.

  • ఇంతకు ముందు లాగే మున్డుపోని లోని రెండు భాగాలకు ఇరువైపులనుంచి సన్నని పాయలను తీసుకొని వాటన్నింటికి కలిపి బ్యాండ్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు ముందు పోనీ ని రెండు భాగాలుగా చేసి తరువాత పోనీ ని పక్కకు తీసి పెట్టుకో వాలి. అలాగే విడదేసిన భాగాలను ఇరువైపులనుంచి తీసిన పాయలను కలిపి బ్యాండ్ పెట్టుకోవాలి.

  • పై విధంగానే ఇప్పుడుకూడా మున్డుపోనిని రెండు భాగాలుగా చేసుకోవాలి. అలాగే తరువాత పోనీ ని పక్కకు పెట్టి ఆ భాగాలకు ఇరువైపులా పాయలన్యు కలిపి మరో బ్యాండ్ పెట్టుకోవాలి.

  • అలా జడమోతం పూర్తియ్యాక పోనీలను కాస్త వాదులు చేసుకోవాలి. దాంతో మీ హెయిర్ స్టైల్ మరింత అందంగా మారుతుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here