ప్రేమ పూల నెయిల్ ఆర్ట్ డిజైన్

ప్రేమ పూల నెయిల్ ఆర్ట్ డిజైన్

రోజుకూ డ్రెస్ వేసుకున్నట్లుగా, రోజుకో నెయిల్ ఆర్ట్ వేసుకోవడం కామన్ అయ్పోయింది .వేసుకున్న మోడల్ లో నే మల్లి పెయింట్ వేసుకోవాలంటే బోర్ కొడుతుంది.

అందుకే ఈసారి సరికొత ఆర్ట్ ఈ పోస్ట్ లో అందిస్తున్నాం. పాత ఆర్ట్ ను రిమూవర్ తో తుడుచుకొని ఈ ప్రేమ పువ్వు లను మీ గోళ్ళ పై పూయించుకోండి నలుగురిచేత నైస్ ఆర్ట్ అనిపించుకోండి. ఈ ఆర్ట్ వేసుకోవడం చాలా ఈజీ, కింది విధంగా ట్రై చెయ్యండి.

  • ముందుగా గోళ్ళను శుభ్రం చేసుకొని శాపే చేసుకోవాలి. తరువాత నెయిల్ మొత్తానికి లైట్ పింక్ కలర్ ను అప్లై చేసుకోవాలి.దాని పైన వైట్ కలర్ ను అక్కడక్కడ లైట్ గా చరాలుగా వేసుకోవాలి.

  • తరువాత రెడ్ కలర్ నైల్ పోలిష్ తో కాస్త దూరం లో ఒక లవ్ సింబల్ కిందికి మరొక లవ్ సింబల్ వాచేలా వెసుకొవలీ .

  • ఇప్పుడు బ్లాకు కలర్ నైల్ పోలిష్ తో సన్నని బ్రెష్ తీసుకొని సింబల్ పైన ఎనిమిది అంకె ఆకారం లో అడ్డంగా వేసుకోవాలి.

  • తరువాత అడ్డంగా వున్నా ఎనిమిదే ఆకారం లో బ్లాకు కలర్ తో చిన్న చిన్న గీతలు పెట్టుకోవాలి.

  • ఇప్పుడు బ్లాకు కలర్ ను సన్న ని బ్రెష్ తీసుకొని గోరు నుంచి స్టార్ట్ చేసి, ఎనిమిది ఆకారం మధ్యలోనుంచి దానికి తిన్నగా వున్నా సింబల్ కు కలపాలి.

  • తరవాత మరో సింబల్ కి తిన్నగా ఒక ఎనిమిది ఆకారాన్ని అడ్డంగా వేసుకొని, మధ్యలోనికి గీత గీస్తూ సింబల్ ని కలపాలి.

  • ఇప్పుడు రెడ్ సింబల్ లో తెల్లని నైల్ కలర్ తో చంద్ర వంక ల గీసుకోవాలి.

  • నెయిల్ బాగా ఆరిన తరువాత ట్రాన్స్పరెంట్ కలర్ ను వేసుకుంటే సరిపోతుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here