ఫాక్స్ వాటర్‌ఫాల్స్ బ్రైడ్ హెయిర్ స్టైల్ డిజైన్

ఇది ‘ఫాక్స్ వాటర్‌ఫాల్స్  బ్రైడ్’ హెయిర్ స్టైల్, మిగితా కొప్పులతో పోలిస్తే ఈ స్టైల్ కాస్తంత భిన్నంగా వుంటుంది. ఎందుకంటే ఇందులోని అల్లికలు వాటర్‌ఫాల్స్   లా కనిపిస్తుంది. అందుకే ఈ హెయిర్ స్టైల్ పేరు ఫాక్స్ వాటర్‌ఫాల్స్  బ్రైడ్.

ఇది ఎలాంటి డ్రెస్ ల కైనా భలేగా వుంటుంది అంతే కాదు ఈ హెయిర్ స్టైల్ ను వేసుకోవడానికి జుట్టు పొడవుగా ఉండవలసిన అవసరం లేదు. ఓ మాదిరిగా వున్నా సరిపోతుంది.

  • ముందుగ జుట్టునంత చిక్కులేకుండా దువ్వు కోవాలి. తరువాత హెయిర్ ను రెండు భాగాలు గా చేసి పైదానిని ఏదైనా ప్లక్కేర్ సహాయంతో టైట్ చెయ్యాలి. ఇప్పుడు ఎడమ చెవి వైపున మూడు పాయలు తీసి జాడగా అల్లి బ్యాండ్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు కింది భాగంలోని హెయిర్ ను ఒక సన్నని పాయను తీసుకొని జడలోని ఒక అల్లిక్క కింద నుంచి పైకి తీయాలి ఆ పై పాయ కిందకు రాకుండా ఏదైనా క్లిప్ పెట్టాలి.

  • తర్వాత ముందు తీసిన దానిపక్కన్నే మరో పాయను తీసి మరో అల్లిక కింది నుంచి పైకి తీయాలి. పైవిధంగానే ఆ పాయను ముందు పాయతావు కలిపి క్లిప్ పెట్టాలి.

  • పై స్టెప్ విధంగానే మరో పాయను అల్లిక నుంచు బయటకు తీసి దానికి క్లిప్ పెట్టుకోవాలి. అలా కింది భాగం లోనికి జుట్టు మొత్త్తం అల్లికల్లోనుంచి బయటకు తీయాలి.

  • ఇప్పుడు ఫోటో లో కనిపించినట్లు పైభాగం లో ని జుట్టును చిక్కు లేకుండా హెయిర్ స్ప్రే చేసుకుంటూ దువ్వుకోవాలి.

  • ఆ దువ్వుకున్న హెయిర్ మొత్తం కలిపి హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి, మరోసారి పోనీ దువ్వుకుంటే చిక్కులు వుండవు.

  • మొదటగా అల్లుకున్న జడపోని కాస్తంత మిగులుతుంది(వాటర్‌ఫాల్స్ అయ్పోయాక) ఆ జుట్టును ఇప్పుడు పైపోని చుట్టూ తిప్పుకొని అది వాడులుకాకుండా స్లయిడ్ పెట్టుకోవాలి.

  • ఆ పోనీ ని ఇప్పుడు మరోసారి దువ్వుకొని ట్విస్ట్ చేసుకోవాలి.

  • ఆ ట్విస్ట్ చేసుకున్న జుట్టును కొప్పుగా చేసుకొని ,అది లూసె కాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి.

  • అలాగే కొప్పులో నుంచి జుట్టు ఏమాత్రం బయటకి రాకుండా కావలసిన చోట స్లైడ్స్ పెట్టుకోవాలి అలాగే చివరగా హెయిర్ చుట్టూ స్ప్రే చేసుకోవాలి. అంతే ఎంతో అందమైన హెయిర్ మీ సొంతం.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here