ఫ్లవర్ బ్రైడ్ హెయిర్ స్టైల్ డిజైన్

చిన్న పిల్లలైతే రెండు జడలు పెద్దవల్లైతే వాలు జడ తప్ప మరో మోడల్ ట్రై చెయ్యడానికి మగువలు పెద్దగ ఇష్టపడరు ఎందుకంటే అందం సంగతి తరువాత చిక్కు పడితే జుట్టు వుదిపోతుందని భయపడతారు.

కాని, ఒకటి లేదా రెండు కాదు ఏకంగా నాలుగు జడలతో ముడి చుట్టి సిగలో గులాబి అవసరం లేనట్లుగా , వున్నా కింది జడ పువ్వును చూస్తే ట్రై చెయ్యకుండా ఉండలేరు. పైగా ఈమోదేల్ తో జుట్టు చిక్కు పడే ప్రమాదం కూడా లేదు.

 • ముందుగా హెయిర్ ను నాలుగు పాయలు గా చేసుకొని వెనుక వున్నా రెండు పాయలను రెండు జడలు గా చివరివరకు అల్లుకోవాలి.

 • తరువాత కుడి వైపు పాయలో కొద్దిగా ఫంక్ తీసుకొని మిగిలిన హెయిర్ ను చివరి వరకు జడలా అల్లుకోవాలి.

 • ఇప్పుడు ఎడమ పాయలో కుడా కొద్దిగా ఫంక్ తీసుకొని మిగిలిన హెయిర్ ను చివరి వరకు జడల అల్లుకోవాలి.

 • తరువాత వెనుక వైపు వున్నా జాడల్లో కుడి జడను టైట్ గా నుడి పెట్టుకోవాలి.

 • తరువాత ముడి మొత్తం కదలకుండా ఉండేందుకు హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి.

 • ఇప్పుడు ఎదమజాడ తీసుకొని, ముందుగా ముడిపెట్టిన కుదిజడకు ఆనుకునేలా చుట్టాలి.

 • తరువాత ముడులు కదలకుండా ఉండేందుకు హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి.

 • ఇప్పుడు తలముండు భాగం లో వున్నా కుదిజడను కాస్త లూసె చేసుకొని తల వెనుక భాగం నుంచి తిప్పుకోవాలి.

 • ఇప్పుడు ఆజడను ముడికి ఆనించి అడుగు భాగం లో కదలకుండా పిన్ పెట్టుకోవాలి.

 • తరువాత ముందు భాగంలోవున్న ఎడమ వైపు జడ కుడా లూసె చేసుకొని తల వెనుకనుంచి కుడివైపుకు తిప్పుకోవాలి.

 • ఇప్పుడు ఆ జడ ముడికి ఆనించి అడుగు భాగం లో కదలకుండా పిన్ పెట్టుకోవాలి.

 • ఇప్పుడు ముందు భాగంలో ఫంక్ తీసుకున్న హెయిర్ ను కాస్త సెట్ చేసుకుంటే ఫ్లవర్ బ్రైడ్ మీ సొంతం అవుతుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here