బిగ్ బ్రైడ్ బన్ హెయిర్ స్టైల్ డిజైన్

ఎప్పుడు చూసిన ఇంట్లో వుండే పెద్దమ్మ నో పక్కింటి పిన్నమ్మనో మోడల్ జడలు వేయమని అడగదమేనా , అవసరం లేదు మీకు మీరే వేసుకో వచ్చు వాళ్ళకు వచ్చిన ఓల్డ్ మోడల్స్ కాదండి న్యూ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్, మీకు మీరే అల్లుకొని ఔరా అనిపించ్కోవచ్చు . వేసుకున్న ద్రేస్స్కు తగ్గట్లు, మీ పేస్ కట్కి తగట్టు రోజుకో మోడల్ వేసుకోవాచు అందుకే ఈ సారి ఈ ఆర్టికల్ లో కొత్త హెయిర్ స్టైల్ డిజైన్ డిస్ప్లే చేసాం.

  • ముందుగా చిక్కులు లేకుండా హెయిర్ మొత్తం దువ్వుకోవాలి తరువాత కుడివైపు ముందు భాగం లో కాస్త ఫంక్ వదులుకొని మూడు పాయలు తీసుకోవాలి.

  • తరుపత మూడు పాయలను అల్లుకుంటూ వెనక భాగం లోనికి హెయిర్ నుంచి ఒక్కో పాయను ఆ జడకు ఆడ్ చేసుకోవాలి.

  • చివరివరకు అలానే పాయలు అల్లుకుంటూ జడ అల్లుకోవాలి.

  • ఇప్పుడు జడ మొత్తం అల్లిన తరువాత హెయిర్ బ్యాండ్ పెట్టుకొని జడమోతం లూసె గా చేసుకోవాలి.

  • జడ అల్లగా మిగిలిన హెయిర్ కు చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని హెయిర్ టైట్ చేసుకోవాలి.

  • తరువాత చిన్న రబ్బరు బ్యాండ్ పై పెద్ద రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు బ్యాండ్ పెట్టుకున్న హెయిర్ మొత్తం చిక్కు లేకుండా దువ్వు కోవాలి.

  • తరువాత ఆ హెయిర్ మొత్తం పెద్ద బ్యాండ్ లోనికి రివర్స్ లో పెట్టుకొని ముడిల చేసుకోవాలి.

  • ఇప్పుడు ముందూగా అల్లుకున్న జడను ముడి కింది నుంచి తిప్పుకొని ఎడమవైపుకు తీసుకొని టైట్ గా పెట్టుకోవాలి.

  •  చివరగా ఆ జడ ఉడిపోకుండ ఉండేందుకు జడకు, ముడికి కలిపి హెయిర్ పిన్ పెట్టుకోవాలి.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here