లెఫ్ట్ బన్ హెయిర్ స్టైల్ డిజైన్

ఇక్కడ కనిపిస్తున్న హెయిర్ స్టైల్ నే లెఫ్ట్ బన్ అంటారు. దీన్ని వేసుకోవడం చాల సింపుల్. అంతేకాదు చూడడానికి కూడా చాల అందంగా వుంటుంది, ముఖ్యంగా జుట్టును టైట్ గా అల్లుకునేవారికి ఈ హెయిర్ స్టైల్ బాగా నచ్చుతుంది. దీనిని వేసుకోవడానికి జుట్టుకస్తంత పొడువుగా, వొట్టుగా వుంటే చాలూ.

ఈ హెయిర్ స్టైల్ అన్ని డ్రెస్ ల మీదకు నప్పుతుంది కాక పొతే ముఖ్యంగా స్కాట్స్ గవన్ల మీదకు మరింత అందంగా కనిపిస్తుంది. మరి అలంటి హెయిర్ స్టైల్ మీరు వేసుకోవలనుకుంటే కింద స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • ముందుగా జుత్తునంత చిక్కులేకుండా దువ్వుకోవాలి. హెయిర్ స్ప్రే చేసుకుంటే జుట్టును సాఫ్ట్ గా, చిక్కులు పడకుండా వుంటుంది. తర్వాత ఎడమవైపు పాపిడి తీసి కుడివైపు జుట్టులో నుంచి మూడు పాయలు తీసుకోవాలి.

  • ఇప్పుడు ఆ మూడు పాయలను ఒక అల్లిక అల్లి, ఇరువైపులనుంచి ఒక్కో పాయను తీసుకొని జడలో కలిపి అల్లాలి .

  • మల్లి పైవిధంగానే రెండు వైపులా నుంచి ఒక్కో పాయను తీసుకొని అల్లాలి. అల్లిక కాస్త టైట్ గా ఉండేలా చూసుకోవాలి. మధ్యలో హెయిర్ స్ప్రే చేసుకుంటూ వుండాలి.

  • తర్వాత కుడా పైవిధంగా ఫ్రెంచ్ స్టైల్ లోనీ జడను అల్లుకోవాలి. ప్రతి పాయ లోను జుట్టు కాస్తంత ఎక్కువగానే ఉండేలా చూసుకోవాలి అలా అయ్తేనే అల్లిక అందంగా కనిపిస్తుంది.

  • ఇప్పుడు మిగిలిన జుట్టును మరోసారి చిక్కులేకుండా దువ్వుకోవాలి పై చెప్పిన విధంగానే ఇరువైపులనున్న్చి ఓ పాయను తీసుకొని, జడలో అల్లుకోవాలి. జడ పూర్తిగా కుడినుంచి ఎడమకు వచ్చేల చూసుకోవాలి.

  • తలపై భాగం లోని జుత్తునంత అయ్పోయాక కింది భాగం లోని జుట్టును చివరి వరకు మాములుగానే అల్లుకోవాలి.

  • ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్నవిదంగా ఆజడను ఎడమ వైపు చెవిదగ్గర నుంచి కిందికి పైకి ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే, చుట్టుకోకుండానే కొప్పు తయారావుతుంది.

  • ఇప్పుడు జడమోత్హం కొప్పులా మారాక, దాని చట్టు స్లైడ్స్ పెట్టుకోవాలి, అంతే ఎంతో అందమైన లెఫ్ట్ బున్ హెయిర్ స్టైల్ మీ సొంతం.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here