హెడ్ బ్యాండ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ డిజైన్

ఎంత ముస్తాబైన మగువలకు కేశాలంకరణ తోనే అసలైన అందం వస్తుంది అందుకే వేసుకున్న జడ చేదిరిపోతుందని మేకప్ అంత ఐన తరువాత హెయిర్ అల్లుకుంతం.

మరి మీకు ఎప్పుడు ఒకటే మోడల్ జడ వేసుకోవాలంటే బోర్ కొట్టడం లేదా…? అయతే ఈసారి ఈ పోస్ట్ లో మీకు ఒక కొత్త మోడల్ జడ ను షేర్ చేస్తున్నాము, ఈ జడ ఎలాంటి డ్రస్స్ ఐన యిట్టె సూట్ అవుతుంది. అంతే కాదండోయ్ ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడం చాల సులభం.

 • ముందుగా హెయిర్ మొత్తం చిక్కు లేకుండా బాగా దువ్వుకోవాలి, తరువాత కుడి పాపిడి తీసుకొని ఎడమవైపు హెయిర్ లో పిక్ లో చూపించినట్లు మూడు పాయలు తీసుకోవాలి.

 • ఇప్పుడు ఎడమవైపు ముందు భాగంలో వున్నా హెయిర్ ను కొంత వదిలి మిగిలిన వెనకవైపు హెయిర్ మొత్తం కదలకుండా క్లిప్ పెట్టాలి. తరువాత మూడుపాయలను అల్లుకునేందుకు మూడవ పాయను రెండవ పాయ కింద నుంచి మొదటి పాయ పైనుంచి వాచ్చేలా పెట్టుకోవాలి.

 • తరువాత మూడు పాయలకు ముందు వున్నా హెయిర్ ను చిన్న చిన్న పాయలుగా జోడించి వెనకకు అల్లుకోవాలి.

 • ఇప్పుడు ప్రతి పాయకు మరికాస్త హెయిర్ ను ఆడ్ చేసుకుంటూ అల్లుకోవాలి. ఈ క్రమం లో ఎడమవైపు ముందు భాగం లో హెయిర్ కొద్ది కొద్ది గా కలుపుకొని మిగిలింది ముందుకు ఉండేలా చూసుకోవాలి.

 • తరువాత ప్రతి పాయకు వెనుక వైపు వున్నా హెయిర్ ను కలుపుకుంటూ జడను అల్లుకోవాలి.

 • మిగిలిన జడకు కూడా వెనుక హెయిర్ లోను ముందు హెయిర్ లోను చిన్న చిన్న పాయలను కలుపుకుంటూ అల్లుకోవాలి.

 • ఇదేవిధంగా జడ మధ్య వరకు పాయలు కలుపుకుంటూ అల్లుకోవాలి.

 • తరువాత వెనుక హెయిర్ లోని క్లిప్ తీసి అందులో వొక చిన్న పాయను ఆడ్ చేసుకొని అల్లుకోవాలి.

 • చివరివరకు అదేవిధంగా జడ మొత్తం అల్లుకోవాలి తరువాత కాస్త లూసె చేసుకొని, ముందు హెయిర్ ను ముందు కు వుంచి ఎడమ వైపు చేవిదగ్గరలో కదలకుండా పిన్ పెట్టుకోవాలి.

 • ఇప్పుడు ముందు వైపు వదలిన హెయిర్ ను ‘హెయిర్ స్టిక్ రోలేర్ మిషిన్’ ఉస్ చేసి కాస్త రోల్ చేసుకోవాలి. అలా ఇష్టం లేని వారు హెయిర్ ని చిక్కు లేకుండా చూసుకుంటే చాలూ.

 • ఇప్పుడు అదే మెషిన్ తో మొత్తం లీవ్ చేసిన హెయిర్ అంత అలానే అల్లుకోవాలి.లేదంటే నెమ్మదిగా హెయిర్ మొత్తం ఒకసారి దువ్వుకున్న సరిపోతుంది.

 • ఇప్పుడు రెండు వైపులా హెయిర్ ను కాస్త ముందుకు వేసుకుంటే అదిర్ పోయే హెయిర్ సైలె మీ సొంతం అవుతుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here